'ఆలీతో సరదాగా' ముగింపు ఎపిసోడ్... పవన్ తో గ్యాప్ అంటూ అలీ వ్యాఖ్యలు

  • ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమం
  • చివరి ఎపిసోడ్ కు హోస్ట్ గా సుమ
  • అలీని ఇంటర్వ్యూ చేసిన సుమ
  • పవన్ తో తనకు గ్యాప్ రాలేదన్న అలీ
  • గ్యాప్ క్రియేట్ చేశారని వెల్లడి
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ హోస్ట్ గా ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమం ముగింపుకు చేరుకుంది. చివరి ఎపిసోడ్ కు ప్రముఖ యాంకర్ సుమ విచ్చేసి అలీని ఇంటర్వ్యూ చేయడం విశేషం. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ యూట్యూబ్ లో పంచుకుంది. 

పవన్ కల్యాణ్ తో గ్యాప్ ఎందుకు వచ్చిందంటూ అలీని సుమ ప్రశ్నించడం ఈ వీడియోలో చూడొచ్చు. పవన్ తో గ్యాప్ రాలేదని, గ్యాప్ క్రియేట్ చేశారని అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగిందంటే.. అంటూ అలీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలీ ఏం చెప్పారన్నది ఈ నెల 19న ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ లో చూడొచ్చు. 

ఈ ఎపిసోడ్ లో అనేక ఇంతర అంశాలను కూడా అలీ వెల్లడించారు. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, తన తొలి పారితోషికం వంటి వివరాలు పంచుకున్నారు. సుమ ఛలోక్తులతో ఈ గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ జాలీగా సాగినట్టు ప్రోమో చూస్తే తెలుస్తుంది.

Ali
Pawan Kalyan
Alitho Saradaga
Suma
Tollywood

More Telugu News